బార్లీ నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే

శనివారం, 29 జులై 2023 (21:56 IST)
బార్లీ నీరు మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, అధిక క్రియాటినిన్ స్థాయిలు వంటి సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడానికి కిడ్నీకి సహాయపడుతుంది. వీటితో ఇంకేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. అధిక బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది.
 
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. రక్తంలో చక్కెరను స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది. బార్లీ వాటర్ తాగుతుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
 
చర్మం కాంతివంతంగా వుండేందుకు బార్లీ వాటర్ మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన గర్భాన్ని నిర్ధారించడంలో బార్లీ వాటర్ హెల్ప్ చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు