కరోనావైరస్ నుంచి కోలుకున్నా ఆ సమస్యలు పీడిస్తున్నాయట (Video)

బుధవారం, 10 జూన్ 2020 (23:41 IST)
కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా కలిగించే దుష్ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు అధ్యయనాలు చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి సంబంధించి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే కోవిడ్ నుండి కోలుకున్న వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి.
 
కోవిడ్ కారణంగా మరిణించిన వారిలో 40 శాతం మంది గుండె రుగ్మతలతో బాధపడటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గుండె సంబంధిత, రక్తనాళాల వ్యాధులు కోవిడ్ కారణంగా ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీపీ షుగర్ వంటివి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హితవు చెబుతున్నారు. సాధారణ వ్యక్తుల కంటే వీరు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
 
గుండె పోటు రావడం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు కరోనా వల్ల కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు శ్వాసకోశ ఇబ్బందులపై దృష్టిపెట్టిన వైద్యులు ఇతర అవయవాలపై కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ లాంటి డ్రగ్స్ అంతకుముందే వాడుతున్న గుండె సంబంధ ఔషధాలతో చర్యలు జరిపే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
 
ఇదివరకు గుండెపోటు లేదా బీపీ లేనివారు కూడా తాజాగా దీనివల్ల హృద్రోగాలకు గురౌతున్నారని వెల్లడించారు. ఇతర వైరస్‌లు దీనికి మరింత బలాన్ని ఇస్తున్నాయని చెబుతున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు