ఎలాగో ఆ అమ్మాయి నంబర్ కనుక్కుని ఫోన్ చేసా... ఒక్కసారి ఇచ్చి తర్వాత?

బుధవారం, 6 మార్చి 2019 (19:06 IST)
నా పేరు ఆదిత్య. నాకు నాలుగు సంవత్సరాలు క్రితం పెళ్లయింది. మాకు ఒక పాప. ఇప్పటికీ మేము చాలా ప్రేమగా ఉంటాం. విషయానికి వస్తే పెళ్లికి ముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించా. కానీ అమ్మాయికి నాప్రేమ విషయం తెలుపలేదు. అమ్మాయికి పెళ్లి అయింది. ఒక పాప, బాబు వున్నారు. ఎలాగో అమ్మాయి నంబర్ కనుక్కుని ఫోన్ చేసా. 
 
నేను లవ్ చేసిన మేటర్ అమ్మాయికి ధైర్యం చేసి చెప్పా. నేను ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తున్నా అని చెప్పా. కానీ తను ఒప్పుకోవడం లేదు. ఈమధ్య తరచూ ఆమె గుర్తుకు వచ్చి చాలా బాధపడుతున్నా. చాలా రకాలుగా బ్రతిమిలాడినా కనికరించడంలేదు. ఐతే నేను వదిలిపెట్టకుండా బ్రతిమాలుతుండేసరికి ఓ రోజు తను నాకు శారీరక సుఖాన్ని ఇచ్చింది. 
 
ఇప్పుడు నాకు ఆ అమ్మాయి కావలనిపిస్తుంది. కానీ ఆమె నన్ను మళ్ళీ దూరం పెడుతుంది. ఎక్కడో ఏ మూలనో నేనంటే ఇష్టం ఉంది కాని బయటపడటంలేదు. నాతో చాలా విషయాలు మాట్లాడుతుంది. ప్రేమ విషయం గురించి చెప్పడం మొదలుపెడితే ఫోన్ కట్ చేస్తుంది. నేనేమి చేయాలి?
 
ప్రేమించిన అమ్మాయితో ప్రేమ విషయాన్ని చెప్పలేనివాళ్లు ఇలాగే జీవితంలో అటూఇటూ వేలాడుతూ బతుకు వెళ్లదీయాల్సి వస్తుంది. ఇద్దరికీ పెళ్లిళ్లయిపోయి హాయిగా వుంటున్నారు. శారీరక కలయిక తప్పు అన్నది మీ ఇద్దరికీ తెలుసు. అది తెలుసుకునే ఆమె మిమ్మల్ని దూరంగా పెడుతోంది. కాబట్టి మళ్లీ అలాంటి తప్పు చేసి ఇద్దరి జీవితాలను సమస్యల్లో పడవేసుకోవాలనుకోవద్దు.

ఓ స్నేహితురాలిగా మాత్రమే ఆమెను మీరు చూడాల్సి వుంటుంది. ప్రేమనేది దూరమైతే అది ఇద్దరి హృదయాల్లో ముల్లులా గుచ్చుకుంటూ వుంటుంది. కానీ ఆ ముల్లును భరిస్తూ బ్రతకాల్సిందే. అంతకుమించి ఆలోచన చేస్తే అది ఇబ్బందులను తెస్తుందని గుర్తుంచుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు