జలుబు, జ్వరం.. అనారోగ్యంతో వ్యాయామం చేయవచ్చా?

మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (23:03 IST)
అనారోగ్యంతో వున్నప్పుడు వ్యాయామం చేయవచ్చా అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ఈ కథనం చదవాల్సింది. ఆరోగ్యంగా వుండాలంటే.. ప్రతిరోజూ వ్యాయామం అవసరం. రోజువారీ వ్యాయామం అనేది శరీర వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఎరోబిక్ శిక్షణలను రోజువారీగా 45 నిమిషాలు చేస్తే అనారోగ్యం నుంచి గట్టెక్కవచ్చు. కానీ, శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, జ్వరం, జలుబు వంటి రుగ్మతలు ఏర్పడిన సమయంలో వ్యాయామాన్ని నివారించడం మంచిది అంటున్నారు, వైద్యులు. 
 
"ఒక వ్యక్తి శరీర జ్వరము లేదా జలుబుతో బాధపడుతునప్పుడు అలసిపోయే స్థితిలో శారీరక శ్రమ చేయడం మంచిది కాదు. దీంతో శరీర నొప్పులు ఎక్కువవుతాయి. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో అలసట కూడా ఎక్కువవుతుంది. అందుకే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వ్యాయామాన్ని పక్కనబెట్టేయాలని వైద్యులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు