గుడ్ ఫుడ్ : రోజుకు ఒక్క లవంగం ఆరగిస్తే...

వరుణ్

మంగళవారం, 30 జనవరి 2024 (13:48 IST)
వంటింట్లో లభ్యమయ్యే అనేక రకాలైన వంట దినుస్సుల్లో లవంగాలు ఒకటి. వీటిని ఆరగించడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని న్యూట్రిషన్లు చెబుతున్నారు. మంచి ఆహారంలో లవంగాలు ఒకటని వారు అంటున్నారు. 
 
ప్రతిరోజూ ఉదయాన్నే లవంగం తినడం వల్ల నోటిలో లాలాజలం పెరిగి జీర్ణశక్తి మెరుగవుతుంది. లవంగాలు తలతిరుగుడు, కడుపులో మంటలను కూడా తగ్గిస్తాయి. లవంగాలు తినడం వల్ల వయసు పైబడే వేగం కూడా తగ్గుతుంది. లవంగాన్ని నమలినప్పుడు వెలువడే సుగంధం, అందులోని యాంటీమైక్రోబియల్ గుణాలు నోటి ఆరోగ్యానికి దోహదపడతాయి. లవంగం నమలడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..... నోటి దుర్వాసన తొలగిపో తుంది. నోరు తాజాగా ఉంచుతుంది. 
 
ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. జీర్ణశక్తిని పెంచడంతో పాటు, వ్యాధి నిరోధకశక్తి సామర్ధ్యాన్ని పెంచుతాయి. లవంగాలతో మలబద్ధకం తొలగడంతో పాటు, వీటిలోని అనాల్జెసిక్ గుణాల వల్ల ఇది సహజసిద్ధ నొప్పి నివారిణిగా కూడా పని చేస్తుంది. 
 
లవంగాల్లోని హెపటో ప్రొటెక్టివ్ ప్రభావాలు కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. కాలేయంలో కొత్త కణాల ఉత్పత్తిని పెంచడంతో పాటు, థైమాల్, యూజినాల్ మొదలైన చురుకైన కాంపౌండ్స్‌లో కాలేయంలోని విషాలను తొలగిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు