లావుగా వున్నావే.. ఐస్‌క్రీమ్ తినొద్దే.. అన్నాడు.. అంతే గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే?

శనివారం, 17 ఆగస్టు 2019 (17:09 IST)
లావుగా వున్నావు, ఐస్ క్రీమ్‌ తినొద్దని బాయ్‌ఫ్రెండ్ చెప్పాడు. అంతే కోపంతో గర్ల్ ఫ్రెండ్ ఊగిపోయింది. అంతటితో ఆగకుండా కత్తెరతో బాయ్‌ఫ్రెండ్‌ను చంపేసింది. చైనాలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఝుమాదియన్ నగరంలో వాంగ్ అనే యువతి ఝాంగ్ అనే యువకుడితో ప్రేమలో వుంది. ఇంకా ఇద్దరూ డేటింగ్‌లో వున్నారు.  
 
ఈ జోడీ ఫెంగ్వాంగ్ రోడ్డులో షాపింగ్ చేస్తున్న సమయంలో వాంగ్‌కు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. వాంగ్ అప్పటికే అధికబరువుతో ఉందని ఆమె ప్రియుడు బాధపడుతుండేవాడు. ఐస్ క్రీమ్ తింటే మరింత లావు అవుతుందని భావించి ఆమెను ఐస్ క్రీమ్ తినొద్దన్నాడు. తినాలనుందని చెప్పినా బాయ్ ఫ్రెండ్ ఒప్పుకోకపోవడంతో పక్కనే ఓ దుకాణంలో కత్తెర కొనుక్కుని వచ్చి తన బాయ్ ఫ్రెండ్ ను కసిదీరా పొడిచింది. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన ఝాంగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో అతనికి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాంగ్‌ను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు