కరోనా వైరస్ వ్యాప్తికి అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరించడమే... మతపెద్ద

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (12:32 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ వైరస్ కోరల్లో 210కి పైగా దేశాలు చిక్కుకున్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తికి గల కారణాలను ఓ మతపెద్ద వివరించారు. అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరించడం వల్లే ఈ వైరస్ వ్యాపిస్తోందంటూ పాకిస్థాన్‌కు చెందిన ఆ మతపెద్ద వ్యాఖ్యానించారు. పైగా, ఈ వ్యాఖ్యలను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే చేయడం గమనార్హం. 
 
పాకిస్థానులో 'ఎహ్సాస్‌ టెలిథాన్' నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో దేశ ప్రధాని ఇమ్రాన్‌తో పాటు ఆ దేశ మతపెద్ద తారిక్ జమీల్ పాల్గొన్నారు. ఇందులో మతపెద్ద మాట్లాడుతూ, పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తికి అమ్మాయిలు పొట్టి పొట్టి దుస్తులు ధరించడమే కారణమన్నారు. ఇటువంటి అమ్మాయిల ప్రవర్తనపై పాక్‌లో‌ ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు.
 
'మన దేశంలోని అమ్మాయిలు డ్యాన్సులు చేయడానికి కారణం ఎవరు? వారిని పొట్టి దుస్తులు ధరించాలని కోరుతోంది ఎవరు? ఆ పాపానికి జవాబుదారి తనం ఉండాల్సింది ఎవరిది? మమ్మల్ని క్షమించాలని నేను ఆ దేవుడిని కోరుతున్నాను. దేశంలోని అమ్మాయిలు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. దేశ యువత నీచమైన దారిలో వెళుతోంది. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు' అంటూ మండిపడ్డారు. ఈ కారణంగానే కరోనా వైరస్ విజృంభిస్తోందని వ్యాఖ్యానించారు. పనిలోపనిగా ఆయన మీడియాపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు