బెయిల్ కోసం మామిడి పండ్లు ఆరగిస్తున్న కేజ్రీవాల్... నిజమా?

వరుణ్

గురువారం, 18 ఏప్రియల్ 2024 (16:23 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే, ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించేలా కనిపించడం లేదు. దీంతో ఆయన బెయిల్ కోసం మామిడిపండ్లు ఆరగిస్తున్నారట. మామిడి పండ్లు తింటే బెయిల్ వస్తుందా అన్నదే కదా మీ సందేహం. అయితే, ఈడీ అధికారులు మాత్రం ఇది నిజమని చెబుతున్నారు. అస్సలే మధుమేహ వ్యాధిగ్రస్తుడైన అరవింద్ కేజ్రీవాల్... మామిడి పండ్లు ఆరగించడం వల్ల శరీరంరో షుగర్ లెవల్స్ పెరుగుతాయని, తద్వారా బెయిల్ పొందవచ్చని ఆయన భావిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. 
 
ఈ మేరకు వారకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే అరవింద్ కేజ్రీవాల్ మామిడిపండ్లను ఆరగించి, షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. వాటివల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది ఆయన ప్లాన్‌గా ఉందని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డైట్ చార్ట్‌ను తమకు సమర్పించాలని న్యాయమూర్తి జైలు అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు, ఈడీ వాదనను కేజ్రీవాల్ తరపున హాజరైన న్యాయవాది వివేక్ జైన్‌ కొట్టిపారేశారు. 
 
కాగా, ఇటీవ‌ల షుగ‌ర్ లెవెల్స్ ప‌డిపోతున్నాయ‌ని క్ర‌మం త‌ప్ప‌కుండా త‌నిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా త‌న వ్య‌క్తిగ‌త వైద్యుడిని అనుమ‌తి ఇవ్వాలంటూ కోర్టులో పిటిష‌న్‌ దాఖ‌లు చేసిన విషయం తెల్సిందే. అయితే, ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశ‌పూర్వ‌కంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నార‌ని, చ‌క్కెర‌తో కూడిన టీ తాగుతున్నార‌ని ఈడీ గురువారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు