పెళ్లి చేసుకుంటానని కడుపు చేశాడు.. ఆపై నాకు ఇద్దరు పిల్లలున్నారన్నాడు..

మంగళవారం, 28 జులై 2020 (19:05 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తోటి ఉద్యోగినిని ఓ వ్యక్తి మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని చంపారన్ జిల్లాలోఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. అదే పరిశ్రమలో పనిచేసే మహిళపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి బుట్టలో వేసుకున్నాడు. ఆ మాయగాడి మాటలను ఆమె కూడా నమ్మింది. చివరకు అతడికి తన సర్వస్వం అర్పించింది. 
 
అయితే ఆ క్రమంలో దామిని గర్భవతి అయ్యింది. తనను పెళ్లి చేసుకోమని నిలదీయగా, తనకు ఆమె గర్భానికి ఎలాంటి సంబంధం లేదని, తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. పైగా తనకు పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని బాంబు పేల్చాడు. 
 
దీంతో సదరు మహిళ జీవితంలో మోసపోయానని నిర్ధారించుకుంది. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కాగా ఆమె సోదరి స్థానికులు ఆమెను కాపాడారు. అంతేగాకుండా.. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు