అమ్మో చలి.. హిమాలయాల్లో 2400 మీటర్ల ఎత్తులో అరుదైన నాగుపాము..

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (18:03 IST)
Snake
సాధారణంగా నాగుపాముల రక్తం చల్లగా వుంటుందట. అందుకే పాములు వెచ్చని వాతావరణంలో వుండేందుకు ఇష్టపడతాయి. కానీ ఉత్తరాఖండ్‌లో అరుదైన నాగుపామును అధికారులు గుర్తించారు. అత్యంత ఎత్తైన పర్వతాలలో ఉన్న నాగుపాముని కనుగొన్నారు. 
 
2200 నుంచి 2,400 మీటర్ల  ఎత్తులో ఉన్న నాగుపాముని గుర్తించి ఫోటోలను విడుదల చేశారు అధికారులు. సాధారణంగా నాగుపాముల రక్తం చల్లగా ఉంటుంది కాబట్టి అవి వెచ్చని వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతాయి. కాని ఈ పాము అంత ఎత్తైన చలిలో ఉంది.
 
హల్ద్వానీలోని ఉత్తరాఖండ్ అటవీ శాఖ పరిశోధనా విభాగం తయారుచేసిన ఒక నివేదికలో ఈ విషయం చెప్పారు. టెరాయ్ ప్రాంతంలో హిమాలయాల ఎత్తు 400 మీ నుండి 2,400 మీటర్ల వరకు ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఈ పాము ఉండటం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద విషపూరిత పాము అటువంటి ఎత్తులో ఎలా పెరుగుతుందోనని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు