ఒడిశాలోని ఎర్ర చీమల పచ్చడికి జీఐ ట్యాగ్ లైన్.. కారణం పోషకాలే..!

సెల్వి

గురువారం, 11 జనవరి 2024 (16:54 IST)
ఒడిశాలోని ఎర్ర చీమల పచ్చడికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఒరిసా ట్రైబల్ స్పెషల్ అయిన ఈ పచ్చడి జీఐ ట్యాగ్‌తో ఇప్పుడు మనందరికీ అందుబాటులోకి రానుంది. ఒరిశా రాష్ట్రంలోని గిరిజనుల ఆహారమైన ఇది.. భౌగోళిక గుర్తింపును సంపాదించుకుంది. 
 
ఈ ఎర్ర చీమల పచ్చడిని గిరిజనులు ఎంతో ముఖ్యమైన వంటకంగా ఉపయోగిస్తారు. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఈ ఎర్ర చీమల పచ్చడి ఉంటుంది. ఈ ఎర్ర చీమల పచ్చడికి జీఐ ట్యాగ్ రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఇందుకు కారణం.. ఎర్ర చీమల చట్నీలో అనేక పోషక విలువలు వున్నట్లు పరిశోధకులు కనుగొనడమే. 
 
ఇందులో ఔషధ గుణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని గుర్తించారు.  అందుకే స్థానికంగా "కై చట్నీ" అని పిలిచే ఈ ఎర్ర చీమల చట్నీకి జీఐ ట్యాగ్‌ను ఇచ్చారు. జనవరి 2వ తేదీ నుంచీ దీనికి భౌగోళిక గుర్తింపు లభించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు