లాక్‌డౌన్ దాష్టీకం : ఛాతిపై బూటు కాలుతో నొక్కిపెట్టి.. లాఠీ ఝుళిపించిన ఖాకీ

ఆదివారం, 3 మే 2020 (13:42 IST)
లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కొందరు పోలీసులు తమ కండకావరాన్ని చూపిస్తున్నారు. లాఠీలు విరిగిపోయేలా చితక్కొడుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా ప్రాంతంలో ఓ యువకుడిపై ఓ ఖాకీ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. ఈ వీడియో సమాజ్ వాదీ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
 
ఎటావా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా రోడ్డుపైకి వచ్చాడు. అతన్ని చూసిన ఓ కానిస్టేబుల్ పట్టుకుని చితకబాదాడు. తనను కొట్టొద్దని ఆ యువకుడు చేతులెత్తి వేడుకుంటున్నప్పటికీ కనికరం లేకుండా లాఠీతో పోలీసు దారుణంగా కొట్టాడు.
 
ఆ యువకుడి ఛాతీపై తన బూటు కాలు పెట్టి నొక్కి పట్టి చెరుకుగడతోనూ కొడుతూ ఆ పోలీసు కానిస్టేబుల్‌ ప్రవర్తించాడు. ఈ వీడియో కాస్త పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. 
 
బాధితుడు సునీల్‌ యాదవ్‌ మానసిక స్థితి బాగోలేదని, అతడు తాగుడుకు అలవాటు పడి గ్రామస్థులపై దాడులకు పాల్పడుతున్నాడని చెప్పారు. గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందుకుని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారని తెలిపారు. అతడిని కొట్టిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 

 

इटावा के बीबा मऊ गांव में फिर सामने आया यूपी पुलिस का बर्बर चेहरा।

SO संरक्षित सिपाही ने निर्दोष मानसिक रूप से विक्षिप्त युवक को बेरहमी से पीटा।
वीडियो वायरल होने के बाद मात्र दोषी सिपाही पर निलंबन की कार्रवाई अपर्याप्त। जांच करा SO को भी किया जाए निलंबित। pic.twitter.com/3xyGLuUsf0

— Samajwadi Party (@samajwadiparty) May 3, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు