మోదీ ప్రభుత్వంపై రాహుల్ చురకలు

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (08:23 IST)
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 'కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అయినా ప్రధాని మోడీ నాయకత్వంలో మన దేశం కరోనాపై పక్కా ప్రణాళికతో పోరాడుతోంది' అంటూ కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

ట్విట్టర్‌ ద్వారా రాహుల్‌ స్పందిస్తూ.. పక్కా ప్రణాళికతో మోడీ ప్రభుత్వం చేసిన పోరాటం వల్ల దేశం అగాధంలోకి కూరుకుపోయిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిడిపి 24 శాతం పడిపోయిందని విమర్శించారు.

12 కోట్ల ఉద్యోగాలు పోయాయని అన్నారు. అదనంగా మరో 15.5 లక్షల లోన్లు నిరర్థకంగా మారిపోయాయని చెప్పారు. ప్రపంచంలోనే ప్రతి రోజు అతి ఎక్కువ కరోనా కేసులు, మరణాలు మన దేశంలో నమోదవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి, కొన్ని మీడియా సంస్థలకు మాత్రం 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు