ఇల్లంతా షేక్ అవుంతోంది.. బహుశా భూకంపం అనుకుంటా.. రాహుల్ గాంధీ (video)

శనివారం, 13 ఫిబ్రవరి 2021 (11:17 IST)
Rahul Gandhi
ఉత్తరాదిన శుక్రవారం రాత్రి భూమి కంపించింది. ఇంట్లో వున్నప్పుడు భూమి కంపిస్తే.. అందరూ పరుగులు పెడతారు. కానీ ఇక్కడ సీన్ మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం... తన కూర్చున్న సీట్లోంచీ పైకి కూడా లేవలేదు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తజకిస్థాన్‌లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకంపనలు ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వచ్చాయి.
 
భూకంపం వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ చికాగో యూనివర్శిటీ విద్యార్థులతో జూమ్‌లో వర్చువల్ ఇంటరాక్టింగ్ అవుతున్నారు. ఆ సమయంలో ఇల్లంతా షేక్ అవుతోందనీ బహుశా భూకంపం కావచ్చని విద్యార్థులకు ఆయన తెలిపారు. ఒకట్రెండు సెకండ్లపాటూ రాహుల్ ఇల్లు కంపించింది. అయినప్పటికీ భయపడని ఆయన... ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి... వెంటనే విద్యార్థుల విషయాల్లోకి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
 
నిజానికి ఈ ప్రకంపనలు వచ్చినప్పుడు ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వచ్చినవి ప్రకంపనలే అయినప్పటికీ భూకంపం వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ప్రజలు చాలా భయపడ్డారు. రాహుల్ మాత్రం నవ్వుతూ… ప్రశాంతంగా కూర్చోవడం అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం రాహుల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

#earthquake @RahulGandhi in between in a live interview when earthquake happened.#earthquake pic.twitter.com/GRp9sxHoMY

— Rohit Yadav (@RohitnVicky) February 12, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు