జమ్మూకాశ్మీర్‌లో 4జీ సేవలు పునఃప్రారంభం.. సుప్రీం తిరస్కరణ

సోమవారం, 11 మే 2020 (17:10 IST)
పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన, కరోనా రోగులను సరిహద్దులకు పంపించడం.. ఉగ్రమూకల దాడులు వంటి ఘటనలను భారత సైన్యం తిప్పికొడుతున్న తరుణంలో జమ్మూకాశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించాలన్న విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ, జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగానికి కీలక సూచన చేసింది. 
 
క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. పిటిషనర్లు పేర్కొన్న అంశాలను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుని సమీక్ష నిర్వహించాలని తెలిపింది.
 
గత నెల 29న జమ్మూకాశ్మీర్ అధికార యత్రాంగం సుప్రీంకోర్టుకు తన వాదనలను వినిపిస్తూ... ఇంటర్నెట్ సేవలను పొందడం ప్రాథమిక హక్కు కిందకు రాదని తెలిపింది. దేశ రక్షణ కోసం, సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించామని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు