అత్యాచారం చేశాడు... తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు.. ఎక్కడ?

శుక్రవారం, 17 జులై 2020 (12:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ చిన్నారిపై నాలుగేళ్ళ క్రితం అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు.. ఇపుడు తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఈ దారుణం గత మంగళవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన యశ్‌వీర్‌ అనే నిందితుడు గతంలో బాధిత కుటుంబంతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఈక్రమంలో అతడు 2016లో ఆ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. 
 
జరిగిన ఘోరం గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యశ్‌వీర్ జైలు పాలయ్యాడు. అయితే ఇటీవల బెయిలు‌పై విడుదలైన నిందితుడు బాధితురాలు, ఆమె తల్లిపై పగ తీర్చుకోపాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆ తల్లీకూతుళ్లు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇది గమనించిన నిందితుడు.. తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్‌ పోనిచ్చి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యశ్‌వీర్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు