శ్రీవారి ఆలయంలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఆదివారం, 15 అక్టోబరు 2023 (12:33 IST)
శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఉత్సవాలు నిర్వహించేందుకు స్వామికి అనుమతి కోరుతూ అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముదు శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనులవారు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. ఉదయం 9 గంటలకు బంగారు తిరుచ్చిపై వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగినున్నారు. 
 
రాత్రి నుంచి వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఇక ఆలయ మాడ వీధుల్లో విశ్వక్సేనులవారి ఊరేగింపును ఆగమభాషల్లో సేనాధిపతి ఉత్సవంగా పిలుస్తారు. శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు నిర్వహించిన అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడింది. ఇక విత్తనాలు మొలకెత్తడాన్నే అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి ఆశీస్సులు పొందడమే అంకురార్పణ ఘటం ఉద్దేశ్యమని అర్చుకులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు