తిరుమల భక్తులు హ్యాపీ, గంటలో సర్వదర్శనం

మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (10:57 IST)
తిరుమల భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వెయిటింగ్ లేకుండా, భక్తులను నేరుగా ఆలయంలోకి పంపిస్తున్నారు. 
 
కేవలం ఒక గంట వ్యవధిలోనే భక్తులకు సర్వదర్శనం ద్వారా స్వామి వారి దర్శనం లభిస్తోంది. చాలా కాలం తర్వాత ఇంత సులువుగా స్వామి వారి దర్శనం లభిస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో చివరి రోజుకు చేరుకున్నాయి. 
 
చివరి రోజున శ్రీవారికి పుష్కరిణిలో అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానాన్ని నిర్వహించారు. మరోవైపు సోమవారం శ్రీవారిని 72,137 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి హుండీకి రూ. 3.37 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు