సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు

సెల్వి

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (17:09 IST)
తెలంగాణ శాసనమండలిలో బీఆర్‌ఎస్ నేతలు రభస సృష్టించారు. శాసనమండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. సభా స్వరూపాన్ని కాపాడాల్సిన శాసనమండలి సభ్యులపై అగౌరవంగా మాట్లాడడం సరికాదన్నారు. 
 
బీఆర్‌ఎస్ సభ్యులు పోడియంను ముట్టడించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో శాసనమండలి చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ముఖ్యమంత్రిపై ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ తెలిపారు. 
 
మరోవైపు శాసన సభ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై అసెంబ్లీలో చర్చించాలని ఆమె కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు