ఒక గంటకు ఉచితంగా హలీమ్.. హైదరాబాదులో జనం జనం.. లాఠీఛార్జ్

సెల్వి

బుధవారం, 13 మార్చి 2024 (10:18 IST)
Hyderabad
మంగళవారం రాత్రి హైదరాబాద్ వీధుల్లో అస్తవ్యస్తమైన దృశ్యాలు కనిపించాయి. రంజాన్ మొదటి రోజు సందర్భంగా ఉచితంగా హలీమ్ ఇవ్వాలని హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ప్రజలు అక్కడికి భారీగా చేరుకోవటంతో పరిస్థితి తారుమారైంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు.
 
హోటల్ వారి సోషల్ మీడియా ఛానెల్‌లలో ఉచిత హలీమ్ ఆఫర్‌ను ప్రచారం చేయడానికి స్థానిక ఫుడ్ బ్లాగర్‌లను ఉపయోగించుకుంది. హోటల్‌లో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఒక గంట పాటు ఉచితంగా హలీమ్‌ను అందించారు. 
 
ఈ ఆఫర్ వందలాది మందిని ఆకర్షించింది. దీంతో జనం భారీగా హోటల్ ముందు బారులు తీరారు. 
ప్రమోషనల్‌ ఆఫర్‌తో ప్రజలు ఇబ్బంది పెడుతున్న హోటల్‌ యజమానిపై మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 
 
మార్చి 12వ తేదీ నుంచి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఉపవాసం ఉండి అల్లాహ్‌ని ప్రార్థిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెల రంజాన్ మాసంగా పేర్కొంటారు.

Hyderabad eatery's free Haleem offer for the first Roza causes chaos as hundreds gather, prompting mild police intervention due to a traffic jam. pic.twitter.com/Uzm1KlUv2o

— IANS (@ians_india) March 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు