తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్‌ శాంతి స్వరూప్ కన్నుమూత

సెల్వి

శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (12:34 IST)
Shantiswaroop
తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్‌గా గుర్తింపు పొందిన శాంతిస్వరూప్ శుక్రవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందారు.
 
నవంబర్ 14, 1983న దూరదర్శన్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఒక దశాబ్దం పాటు టెలిప్రాంప్టర్ సహాయం లేకుండా కేవలం పేపర్లు చూస్తూ వార్తలను అందించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు వార్తలు చదవడం కొనసాగించారు. 
 
శాంతిస్వరూప్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా లభించింది. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. టీవీ యాంకర్‌గా పనిచేసిన ఆయన భార్య రోజారాణి కొంతకాలం క్రితం మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు