రేయ్... ఆదిలాబాద్ అడవిబిడ్డ : ఫోన్‌కాల్‌లో ఎస్ఐ బూతుపురాణం

వరుణ్

బుధవారం, 27 మార్చి 2024 (13:48 IST)
నిజామాబాద్ - ఆర్మూర్ పట్టణంలో పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ వెనుక అనుమతికి విరుద్దంగా అక్రమ భవన నిర్మాణం చేస్తున్నారని జర్నలిస్టులు వెళ్లి ప్రశ్నించడంతో గొడవ ప్రారంభం. జర్నలిస్టులు డబ్బులు అడుగుతున్నారని తెలుసుకున్న ఎస్ఐ రవీందర్ శెట్టి ఫోన్ చేసి అసభ్య పదజాలం వాడుతూ, బూతు పదాలతో దూషించాడు. 
 
బూతు పదాలతో తమను దూషించిన ఎస్ఐ రవీందర్ శెట్టిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసిన విలేకరులు. అయితే డబ్బులు అడిగారని ముందుగా మీ మీద కేసు పెట్టాల్సి వస్తోందని పరోక్షంగా ఆ ఎస్ఐకి అనుకూలంగా పోలీసులు మాట్లాడుతున్నరంటూ విలేకరులు వాపోయారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ దినపత్రికకు చెందిన విలేఖరికి ఫోన్ చేసి పచ్చి బూతులు తిట్టారు. అమ్మను, ఆలీని కూడా తిట్టేశాడు. ఆ ఎస్ఐ పేరు రవీందర్ శెట్టి. తాను ఎవడివద్దకైనా వస్తానని, మీ చౌరస్తాకు వస్తానంటూ హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు