హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవం: అర్థరాత్రి 1 గంట వరకు..?

గురువారం, 28 సెప్టెంబరు 2023 (16:37 IST)
హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా మెట్రో ప్రయాణికులకు మెట్రో రైల్‌ అధికారులు శుభవార్త తెలిపారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించారు. 
 
హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవ కోలాహలం ఇప్పటికే మొదలైంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం కోసం సాగనంపుతున్నారు. 
 
గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. గురువారం అర్థరాత్రి 1 గంట వరకు రైళ్లను హైదరాబాద్‌ మెట్రో నడపనుంది. 
 
రాత్రి 2 గంటలకు ఆయా రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఇందుకోసం ఖైరతాబాద్, లక్డీకపూల్‌ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. 
 
డిమాండ్‌ను బట్టి ఆయా మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. 29వ తేదీన పాత టైమింగ్స్‌ ప్రకారమే మెట్రో రైళ్లు నడుపుతామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు