మెగా పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు 'ఆచార్య' గిఫ్టు?

శుక్రవారం, 17 జులై 2020 (10:23 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుక వచ్చే నెల 22వ తేదీన జరుగనుంది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మెగా ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా, వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహిస్తుంటారు. అలాగే, చిరంజీవి తన అభిమానులకు ఏదో ఒక బహుమతిని ఇస్తుంటారు. ఈ యేడాది కూడా మెగా పుట్టిన రోజున ఆచార్య రూపంలో ఓ బహుమతి ఇచ్చేందుకు చిరంజీవి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ సిద్ధమవుతోంది. ఈ చిత్రం చాలా మేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్‌ను ఎప్పుడు మొద‌లు పెట్టాల‌నే దానిపై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయి. 
 
ఇదిలావుంటే, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజైన ఆగస్టు 22వ తేదీ సమీపిస్తోంది. మ‌రి ఈ సంద‌ర్భంగా 'ఆచార్య'  అభిమానుల కోసం గిఫ్ట్ ఇస్తారా? అని అంటే మాత్రం అవుననే టాక్ వినిపిస్తోంది. 'ఆచార్య' ఫ‌స్ట్ లుక్ లేదా చిన్న‌పాటి టీజ‌ర్‌ను విడుద‌ల చేసేలా మెగా టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. లేదా వేచిచూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు