బాలీవుడ్ అరుంధతి రీమేక్‌లో దీపికా పదుకునే Vs కంగనా రనౌత్ (Video)

బుధవారం, 22 జులై 2020 (19:34 IST)
యోగా టీచర్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో.. లేడి ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన సినిమా అరుంధతి. ఈ సినిమా కొన్నేళ్ల తర్వాత బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఇలా 11 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారు. 
 
ఇంకా ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నిర్మాత అల్లు అరవింద్ మంచి ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నారు. అలాగే ఈ చిత్రాన్ని హిందీలో మరో నిర్మాత మధు మంతెనతో కలిసి నిర్మించనున్నారు. అయితే తెలుగులో అనుష్క వేసిన అరుంధతి పాత్రకోసం హిందీ రీమేక్‌లో దీపికా పదుకొనె లేదా కంగనా రనౌత్ ను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. 
Kangana Ranaut
 
అరుంధతి పాత్ర కోసం దీపికాను ఖరారు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్‌ కూడా ఈ పాత్రకు సరిపోతుందని.. బాలీవుడ్ అరుంధతి కోసం వీరిద్దరి మధ్య పోటీ నెలకొనే అవకాశం వుందని సినీ పండితులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు