ఇలియానాకు నాగ్ అవకాశం ఇచ్చాడా..?

గురువారం, 30 జులై 2020 (18:53 IST)
టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సీనియర్ నిర్మాత పంపిణీదారుడు నారాయణ్ దాస్- పుస్కూర్ రామ్ మోహన్ రావు- శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. 
 
ప్రస్తుతం తెలుగులో మొత్తం వెనుకబడిన హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానాకు నాగ్ అవకాశం ఇచ్చాడని తెలిసింది. అయితే ఈ భామ చివరిసారిగా తెలుగులో రవితేజతో నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా పూర్తిగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమా ఒక మిషన్‌ను సాల్వ్ చేసే అంశంపై వస్తుందని తెలుస్తుంది. అందువల్ల ఈ సినిమా పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.
 
ప్రస్తుతం కొత్త దర్శకుడు సోలోమెన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున ఓ సినిమా చేస్తున్నాడు. నాగార్జున చివరగా మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు