చెర్రీకి జోడీగా శ్రీదేవి కుమార్తె???

మంగళవారం, 21 జులై 2020 (19:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. అయితే, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించనున్నారు. 
 
దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతి కార్యకలాపాలపై దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. 
 
ఇక ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఓ పురాతనమైన దేవాలయం సెట్‌ను వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.
 
ఇక చిరంజీవి సరసన ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రెజీనా ఓ ఐటం పాటలో కనిపిస్తుంది. అయితే, ఈ చిత్రంలో మరో కథానాయికగా దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించే చాన్స్ వుందని టాలీవుడ్‌లో తాజాగా ప్రచారం జరుగుతోంది. 
 
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గెస్ట్ పాత్రలాంటి కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడు. ఆయన సరసన నటించడానికి ఇప్పటికే తమన్నాను మాట్లాడివుంచారు. 
 
అయితే, ఆమెకు డేట్స్ సమస్య వస్తుండడంతో మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జాన్వీ అయితే ఫ్రెష్‌గా ఉంటుందన్న భావనతో చరణ్ ఆమె కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు