నాకు నచ్చిన హీరో విజయ్‌.. ఛాన్సొస్తే వదిలిపెట్టను : 'ఆర్ఎక్స్100' భామ

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:12 IST)
తనకు నచ్చిన హీరో విజయ్ దేవరకొండ అని, అయనతో నటించే ఛాన్స్ వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేసుకోబోనని ఆర్ఎక్స్100 భామ పాయల్ రాజ్‌పుత్ అంటోంది. ఈమె నటించిన తొలి చిత్రం ఆర్ఎక్స్100. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రను పోషిస్తూనే నెగెటివ్ యాంగిల్‌లో హీరోను చంపేందుకు ప్రయత్నించే పాత్రలో నటించింది. ఈ పాత్ర పోషించినందుకు ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. అంతేనా.. ఈ చిత్రంలో ఆమె అందాలను ఏమాత్రం దాచిపెట్టుకోకుండా ఆరబోసింది. ఫలితంగా తాను నటించిన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రవేసుకుంది. 
 
ఆర్ఎక్స్100 చిత్రం తర్వాత బోల్డ్ పాత్రలే రావడంతో సినిమాలు తగ్గించిన పాయల్‌కు వెంకీ, రవితేజ వంటి వారి చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. అయితే స్టార్ హీరోల చిత్రాలలో అవకాశం వచ్చినా.. తన పాత్రకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెపై పెడిన ఆర్ఎక్స్ ముద్ర మాత్రం ఇంకా చెరిగిపోలేదు.
 
ప్రస్తుతం లాక్‌డౌన్‌ని పాయల్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఫిట్నెస్, పిల్లో ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించిన పాయల్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 
 
ఇప్పటికిప్పుడు మీరు ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారు? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. వెంటనే ‘విజయ్ దేవరకొండ’ అంటూ పాయల్ ఆన్సర్ ఇచ్చింది.
 
అంతే ఇక నెటిజన్లు.. విజయ్ దేవరకొండే కావాలంటున్న పాయల్ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. మరి విజయ్‌తో నటించాలని ఉందన్న ఆమె కోరిక ఎప్పటికి నెరవేరుతుందో.. చూద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు