పెళ్లంటేనే వణికిపోతున్న నటి.. ఎవరు? (Video)

గురువారం, 30 జులై 2020 (16:46 IST)
సాధారణంగా ఏ అమ్మాయి అయినా పెళ్లి అంటే ఎగిరిగంతేస్తారు. కానీ, ఆ నటి మాత్రం పెళ్లంటే వణికిపోతోంది. దీనికి కారణం ఓ పెళ్లి ముఠా చేతిలో మోసపోవడమే. దీంతో ఇప్పట్లో పెళ్లి మాట అస్సలు ఎత్తొద్దని తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది. ఆమె ఎవరో కాదు.. నటి పూర్ణ. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లోనే నటించింది. పైగా, బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈమె ఇటీవల ఓ ముఠా చేతిలో మోసపోయింది. 
 
ఇటీవల పూర్ణను ఓ ముఠా వివాహం పేరిట మోసం చేసిన వ్యవహారం సినీవర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విషయమై పూర్ణ మాట్లాడుతూ, 'నాకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించి, వరుడి కోసం విచారిస్తున్నారు. ఆ సమయంలో ఓ ముఠా తన తల్లిదండ్రులను సంప్రదించింది. ఇరు కుటుంబాలు మాట్లాడుకొని వివాహానికి అంగీకరించాయి. 
 
వివాహానికి అంగీకరించిన తాను తదుపరి జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాన్ని ఇద్దరం చర్చించుకున్నాము. అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ముఠా తమతో ప్రేమతోను, అభిమానంతోను వ్యవహరించి మోసం చేశాయి. 
 
వారి గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. ఇప్పట్లో నాకు వివాహం వద్దని తల్లిదండ్రులతో చెప్పాను. వివాహం అంటేనే నాకు భయం వేస్తుంది. ఈ దిగ్ర్భాంతి పరిస్థితుల నుంచి కోలుకొని నటనపై దృష్టి సారిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు