లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చదు, నటనకు ప్రాధాన్యం ఇస్తా : ఆయుషి పటేల్

డీవీ

గురువారం, 28 మార్చి 2024 (16:55 IST)
Ayushi Patel
‘కలియుగం పట్టణంలో’ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్‌లో ఒక్కోలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. నా పాత్రకు ఇంటర్వెల్‌లో ఒకలా, క్లైమాక్స్‌లో మరో ఒపీనియన్ వస్తుంది.. అని  హీరోయిన్ ఆయుషి పటేల్ పేర్కొంది. 
 
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’.మార్చి 29న రాబోతోంది.  ఈ క్రమంలో హీరోయిన్ ఆయుషి పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..
 
‘కలియుగం పట్టణంలో’ అవకాశం ఎలా వచ్చింది? సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది? 
చిన్నతనం నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఆయనలానే ఎదగాలని అనుకునేదాన్ని. ఈ మూవీ నాకు ఓ మేనేజర్ వల్ల వచ్చింది. ఈ మూవీ కోసం ఎన్నో వర్క్ షాప్స్ చేశాం. ఆ టైంలోనే హీరో విశ్వతో కలిసి ఎన్నో సీన్ల గురించి చర్చించుకున్నాం.
 
 ‘కలియుగం పట్టణంలో’ మూవీ కోసం కడపలో షూటింగ్ చేయడం ఎలా అనిపించింది? 
కడపలో అందమైన లొకేషన్స్ చాలా ఉన్నాయి. అక్కడి ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. అక్కడ ఈ చిత్రాన్ని ఎంతో సరదాగా షూట్ చేశాం. చాలా పార్ట్ అక్కడే షూట్ చేశాం. కొంత మాత్రం హైద్రాబాద్‌లో షూట్ చేశాం.
 
 ‘కలియుగం పట్టణంలో’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తోంది? 
ప్రస్తుతం మేం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం టూర్స్ వేస్తున్నాం. వెళ్లిన ప్రతీ చోటా మంచి రెస్పాన్స్ వస్తోంది. మమ్మల్ని అందరూ గుర్తు పడుతున్నారు. మా సినిమా టీజర్, ట్రైలర్ గురించి చెబుతున్నారు. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా నా గురించి, నా ఫస్ట్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
 
 ‘కలియుగం పట్టణంలో’ దర్శకుడు రమాకాంత్ రెడ్డితో పని చేయడం ఎలా అనిపించింది? 
రెండు గంటలకు పైగా నాకు కథను నెరేట్ చేశారు. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంది. మా దర్శకుడు ఎప్పుడూ కూడా కట్ చెప్పరు. కట్ చెబితే ఎండ్‌లో వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మిస్ అవుతాయ్ అని కట్ చెప్పరు. మా దర్శకుడు ఎంతో సరదాగా షూటింగ్ చేసేవారు. కథ ఏం చెప్పారో.. అదే తీశారు. ఆర్ఆర్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది.
 
 ‘కలియుగం పట్టణంలో’ నిర్మాతల గురించి చెప్పండి? 
‘కలియుగం పట్టణంలో’ సినిమా కోసం కడపలో షూట్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. మా అందరినీ చక్కగా చూసుకున్నారు. సినిమాకు ఎంత ఖర్చైనా కూడా వెనుకాడలేదు. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. మంచి సినిమా తీశాం.. దాన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని మా నిర్మాతలు తపనపడుతుంటారు.
 
 విశ్వ కార్తికేయ పక్కన నటించడం ఎలా అనిపించింది? 
విశ్వ కార్తికేయ నాకు ఎంతో సహకరించారు. ప్రతీ సీన్ గురించి చర్చించుకునేవాళ్లం. ఇలా చేద్దాం.. అలా చేద్దాం అని మాట్లాడుకునేవాళ్లం. ఇంత మంచి వ్యక్తితో నా మొదటి సినిమా రావడం ఆనందంగా ఉంది.
 
 తదుపరి చిత్రాల గురించి చెప్పండి? 
కలియుగం పట్టణంలో రిలీజ్ కాకముందే నాకు మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ వంటివి నాకు నచ్చదు. అందుకే చాలా సినిమాలు ఒప్పుకోలేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాను. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదు. కొన్ని సినిమాలు చేసినా పర్లేదు.. మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు