దిల్ బేచారా అదుర్స్.. ఐఎండీబీలో 10/10 మార్కులు..

ఆదివారం, 26 జులై 2020 (11:57 IST)
దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా' ఈ నెల 24వ తేదీన హాట్ స్టార్ స్ట్రీమింగ్ ఆప్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఐఎండీబీలో ఈ సినిమాకు 10/10 ఇవ్వడం పట్ల సుశాంత్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కాస్టింగ్ ముఖేశ్‌ చబ్రా దర్శకుడిగా పరిచయమయ్యాడు. 
 
అలాగే ఈ సినిమా ద్వారా సంజనా సంఘీ హీరోయిన్‌గా పరిచయం అయింది. సుశాంత్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమా రికార్డులు నెలకొల్పోతుంది. సుశాంత్‌ నటన, నాయకనాయికల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. దీంతో దాదాపు అందరు సినీ విశ్లేషకులు ఈ సినిమాకు మంచి రివ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత సినిమా వెబ్‌సైట్ ఐఎండీబీ ఈ చిత్రానికి 10/10 రేటింగ్‌ ఇచ్చింది. మొత్తం 1048 రేటింగ్స్‌ ఆధారంగా దీన్ని ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో కూడా 'దిల్‌ బేచారా డే' అనే హ్యాష్‌‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్రెండింగ్‌ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు