రష్మిక సవాల్‌ను స్వీకరించి పూర్తి చేశా, ఇప్పుడు రకుల్, కాజల్, తమన్నాకు నా సవాల్: రాశీఖన్నా

సోమవారం, 20 జులై 2020 (16:58 IST)
తెరాస ఎంపీ సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ప్రభంజనంలా సాగుతోంది. సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి స్పందిస్తూ మొక్కలు నాటుతున్నారు. అలాగే సామాన్యులు కూడా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా మొన్న మొక్కలు నాటిన రష్మిక మందన్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాశీఖన్నాకు తన సవాల్ విసిరింది. 
ఇవాళ రాశీఖన్నా మొక్కలు నాటి మరో ముగ్గురు నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియాకు ఛాలెంజ్ విసరిరారు. వీరంతా మొక్కలు నాటాలని కోరారు.
అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు