దసరాకి వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ ఉందా? లేదా..?

శనివారం, 24 అక్టోబరు 2020 (13:45 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఎంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు - బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకఫూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ చేసారు.
 
ఈ నెలాఖరు నుంచి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ మాత్రం ఇంకా పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో లుక్ పైన కాన్సన్‌ట్రేషన్ చేసినట్టుగా అనిపించడం లేదు.
 
 అయితే... ఈ సినిమా టీజర్‌ను దసరాకి రిలీజ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో పవన్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. దసరాకి వకీల్ సాబ్ టీజర్ వస్తుందని.. కానీ రావడం లేదని సమాచారం.
 
కారణం ఏంటంటే... టీజర్ లో రిలీజ్ ఎప్పుడు అనేది చెబుదాం అనుకున్నారట. పవన్ ఇంకా షూటింగ్‌కి రాకపోవడంతో ఎప్పటికి కంప్లీట్ అవుతుందో... సంక్రాంతికి పక్కా వస్తుందో లేదో ప్రస్తుతానికి క్లారిటీ లేకపోవడంతో టీజర్ రిలీజ్ వాయిదా పడినట్టు తెలిసింది. ఈ నెలాఖరు నుంచి పవన్ షూటింగ్‌కి వస్తే.. అప్పుడు రిలీజ్ ఎప్పుడు అనేది ఫిక్స్ అవుతుంది.
 
 అందుచేత షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆ తర్వాత దీపావళికి టీజర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. పవన్ షూటింగ్‌కి వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ చేస్తారేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు