మా నాన్న నిజస్వరూపం చూపిస్తారు: మంచు విష్ణు

శుక్రవారం, 30 అక్టోబరు 2020 (22:28 IST)
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున దర్సించుకున్నారు సినీనటులు మంచు లక్ష్మి, మంచు విష్ణు. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. చాలా రోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు లక్ష్మి, విష్ణు. 
 
ఆలయం నుంచి బయటకు వచ్చిన ఇద్దరు సినీప్రముఖులతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది. మా నాన్న మోహన్ బాబు కీ రోల్. ఆ సినిమాలో నాన్న అద్భుతమైన నటనను కనబరిచారు. యాక్టింగ్‌లో ఆయన నిజస్వరూపాన్ని త్వరలో ప్రేక్షకులు చూస్తారు.
 
అలాగే నేను నటించిన మోసగాళ్ళు సినిమా పూర్తయ్యింది. శ్రీను వైట్లతో ఒక సినిమా త్వరలో చేస్తున్నా. ఈ సినిమాలన్నీ విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించాను. చాలా ఆనందంగా ఉందన్నారు మంచు విష్ణు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు