ఎస్పీబీ కోసం అయ్యప్ప ఆలయంలో శంకరాభరణ సంగీత సమర్పణ

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (23:21 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తిరిగి కోలుకోవాలని కోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సంగీత ప్రియులు తమతమ ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం భారతీయ సినీ ఇండస్ట్రీకి చెందిన సంగీత విభాగం కూడా సామూహిక ప్రార్థనలు నిర్వహించింది. ఇపుడు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంల సంగీత సమర్పణ కార్యక్రమం జరిగింది. 
 
కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో సంగీత సమర్పణ చేశారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆలాపించిన 'శంకరా నాద శరీరారా పరా...' అనే పాటను దేవస్థాన వాయిద్యకారులు తమ ప్రదర్శనతో స్వామివారికి సమర్పించారు. దీనిపై అయ్యప్ప ఆలయ బోర్డు ట్రావెన్ కూర్ దేవస్వోం వర్గాలు స్పందించాయి. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ఆయన పేరుతో స్వామివారికి పూజలు నిర్వహించినట్టు వెల్లడించాయి. అప్పట్లో ఘనవిజయం సాధించిన శంకరాభరణం చిత్రంలో బాలు ఆలపించిన 'శంకరా నాద శరీరా పరా' గీతం సాధారణ ప్రజల్లో సైతం ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెల్సిందే. 
 
కాగా, ప్రస్తుతం ఎస్.పి. బాలు ఆరోగ్యం విషమంగా ఉన్నప్పటికీ.. గుండెపోటు రాకుండా ఎక్మో పరికరాన్ని అమర్చారు. దీంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు