“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పూర్తి చేసిన బన్నీ భార్య, పిల్లలు..!

మంగళవారం, 28 జులై 2020 (19:07 IST)
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మెగా డాటర్ సుస్మితా కొణిదెల విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి.. తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో కలిసి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం స్నేహారెడ్డి మాట్లాడుతూ.. ఈ భూమిపైన మనుషులకు ఎంత పాత్ర ఉందో.. ఇతర జీవజాలానికి అంతే పాత్ర ఉంది.
 
ప్రకృతి సమతూల్యంగా ఉన్నప్పుడే అందరం ఆనందంగా ఉంటాం.. అందుకు మొక్కలు నాటడమే మార్గమనే చక్కని ఆశయంతో రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విజవంతం కావాలి. తెలంగాణ మొత్తం పచ్చని నేలగా మారాలని కోరుకుంటున్నాను.
 
అంతేకాదు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లెందుకు తనవంతుగా మరో ముగ్గురికి ఛాలెంజ్‌ను విసురుతున్నట్లు తెలిపారు. అందులో ఒకరు తన భర్త అల్లు అర్జున్, తన స్నేహితులు జూపల్లి మేఘనా రావు (మైహోమ్స్ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్), మరియు ఆర్ సింగారెడ్డికి ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా కోరారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు