ఆస్కార్ రేసులో విద్యాబాలన్ సినిమా.. బెస్ట్ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో...

ఆదివారం, 17 జనవరి 2021 (13:38 IST)
Natkhat
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ‘నట్‏ఖట్’ 2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరి ఆస్కార్ రేసులో నిలిచింది. అటు ‘నట్‏ఖట్’ సినిమాతోపాటు షేమ్ లెస్, షేవింగ్ చింటూ సినిమాలు కూడా ఈ క్యాటగిరిలో పోటీ పడుతున్నాయి. ఇక నట్‌ఖట్‌లో విద్యాబాలన్ తల్లి పాత్రలో నటించగా.. లింగ సమానత్వం, మహిళల పట్ల ద్వేషం తీరుతెన్నులను తన కొడుకును ఓ తల్లి బోధిస్తున్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. 
 
ఈ సినిమాతో విద్యాబాలన్ నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక 2020 బెస్ట్ ఆప్ ఇండియా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మూడో ఎడిషన్లో ‘నట్‏ఖట్’ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది. ఆస్కార్ రేసులో ‘నట్‏ఖట్’ నిలవడం గర్వంగా ఉందని సినీ నిర్మాణ సంస్థ ఆర్ఎస్వీపీ మూవీస్ ట్వీట్ చేసింది. 
 
తాము రూపొందించిన ‘నట్‏ఖట్’ షార్ట్ ఫిల్మ్ ఇంటి నుంచే మార్పు ప్రారంభం అవుతుందని ఇచ్చిన సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుమూలలకు వెళ్ళింది. షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో ఆస్కార్-2021 అవార్డు కోసం మా సినిమా పోటీలో ఉండడం గర్వంగా ఉందని ట్వీట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు