విజయ్ సేతుపతి `విక్రమార్కుడు`

మంగళవారం, 2 మార్చి 2021 (23:01 IST)
Vikramarkudu
పాన్ ఇండియా వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్, మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్లు గా వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై గోకుల్ (కా స్మోరా చిత్రం ఫేమ్) దర్శకత్వంలో నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం "విక్రమార్కుడు". దీనికి "ది రియల్ డాన్" అన్నది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రానికి సిద్దార్థ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రం ప్రీ- రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యఅతిధులు గా విచ్చేసిన అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ మాట్లాడుతూ,  "ఈ చిత్ర దర్శకుడు గోకుల్ తోపాటు మేం ముగ్గురం ఒకే స్కూల్ లో చదువుకున్నాం. ముగ్గురం దర్శకులవుతామని అప్పట్లో అనుకోలేదు. గోకుల్ తమిళ్లో ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు. తమిళ్ విజయ్ సేతుపతితో తీసి సూపర్ హిట్ సాధించిన "జుంగా" సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాను సెలెక్ట్ చేసుకొని విడుదల చేస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి" అని అన్నారు.
 
 చిత్ర సమర్పకులు వాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ..' "ఫ్యామిలీ ప్రేక్షకులంతా చూడదగ్గ నవరసాలు ఉన్న మంచి ఎంటర్ టైన్మెంట్ చిత్రమిది. అన్ని ఏరియాలలో అద్భుతంగా బిజినెస్ అయిన ఈ సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్నాం" అని అన్నారు.
 
 నిర్మాతలు కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావులు మాట్లాడుతూ, మొదటి నుంచి విజయ్ సేతుపతి కి మేం పెద్ద అభిమానులం. ఈ సినిమా చూసిన తరువాత మేం గోకుల్ కు ఫ్యాన్ అవ్వాలా విజయ్ సేతుపతికి ఫ్యాన్ అవ్వాలా అర్థం కాలేదు. ఎందుకంటే విజయ్ సేతుపతిని చాలా హై బడ్జెట్లో, హై రేంజ్లో చాలా బాగా చూపించిన ఏ 1 డైరెక్టర్ గోకుల్ అన్న అందుకే మేం ఆయన ఫ్యాన్ కూడా అయ్యాం. విక్రమార్కుడు చిత్రాన్ని ఈ నెల 5న భారీగా 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నాం" అని అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు గోకుల్ మాట్లాడుతూ,  "ఒకే స్కూల్లో చదివిన మేము డైరెక్టర్స్గా ఒకే వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమాను తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని గతంలో నేను తీసిన "కాష్మోరా" నిరూపించింది. అందుకే తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో ఇష్టం. ఇపుడు వస్తున్న ఈ "విక్రమార్కుడు" సినిమాను కూడా  అదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు