`ఇష్క్‌` ట్రైల‌ర్ చూస్తుంటే జాంబిరెడ్డి అంత హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాంః ప్ర‌ముఖులు

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (18:16 IST)
Isk prerelease
`జాంబిరెడ్డి` ఫేమ్ తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన సినిమా `ఇష్క్‌`. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌23న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ పార్క్‌హ‌యాత్ లో `ఇష్క్` గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో ఇష్క్ మూవీ బిగ్ టికెట్‌ని వేణు శ్రీ‌రామ్‌, నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌,  నందినీ రెడ్డి, శ్రీ విష్ణు, ప్ర‌శాంత్ వ‌ర్మ సంయుక్తంగా ఆవిష్క‌రించారు. వారంతా జాంబిరెడ్డి అంత హిట్‌కావాల‌ని కోరారు.
 
ద‌ర్శ‌కుడు శ్రీ రామ్ వేణు మాట్లాడుతూ, ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారి సెకండ్ ఫిలిం `సుస్వాగ‌తం` ద‌గ్గ‌ర నుండి ఈ మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ పరిచ‌యం. అప్ప‌టి ఎంతో మంచి టాలెంటెడ్ పీపుల్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. ఈ సినిమాతో మ‌రో కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తున్నందుకు వారికి థ్యాంక్స్‌. ఎన్వీ ప్ర‌సాద్‌గారితో మంచి అనుభందం ఉంది. తేజ కోవిడ్ త‌ర్వాత జాంబీరెడ్డితో ప్రేక్ష‌కుల‌కి థియేట‌ర్స్‌ని తిరిగి ప‌రిచ‌యం చేశాడు. భ‌విష్య‌త్తులో డెఫినెట్‌గా పెద్ద హీరో అవుతాడు. ప్రియా ఒక్క క‌న్నుగీటుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యింది. ఈ సినిమా త‌న‌కి మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నాను. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రాజా నా ద‌గ్గ‌ర ఎంసీఏ,  వ‌కీల్‌సాబ్ సినిమాల‌కి వ‌ర్క్ చేశాడు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. త‌న ద‌గ్గ‌ర మంచి మాస్ ప‌ల్స్ ఉంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. డెఫినెట్‌గా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.
 
హీరో తేజ స‌జ్జ మాట్లాడుతూ, మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌లో ప‌ని చేయ‌డం ఒక గౌర‌వంగా భావిస్తున్నాను. మంచి కంటెంట్ ని ప్రోత్స‌హించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన వేణు శ్రీ‌రామ్‌, నందినీ రెడ్డి, నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌, శ్రీ విష్ణు, ప్ర‌శాంత్ వ‌ర్మ గారికి థ్యాంక్స్‌. ‘ఇష్క్‌’ సినిమాలో కూడా మంచి సోల్ ఉంది.ఇది ఒక కొత్త రకం కథ.ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంత వ‌ర‌కూ ఏ సినిమా రాలేదు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌గారితో వ‌ర్క్చేయ‌డం చాలా హ్యాపీ. ఈ సినిమాని అంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను``అన్నారు. ‌
 
ద‌ర్శ‌కురాలు నందనీ రెడ్డి మాట్లాడుతూ, సూప‌ర్ గుడ్ ఫిలింస్ అన‌గానే సినిమా వాళ్లంద‌రికీ ‌పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుంది. సౌత్ ఇండియాలో వ‌న్ ఆఫ్ ది మోస్ట్ స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్‌. ఈ బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేయ‌డం తేజ‌కి నిజంగా ప్రౌడ్ మూమెంట్‌. సాగ‌ర్‌కి ఈ సినిమా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. ప్రియా చాలా అందంగా ఉంది. ఈ సినిమాతో మ‌రిన్ని అవకాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాను తేజ‌కు హ్యాట్రిక్ అవుతుంద‌ని అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వాకాడ అప్పారావు మాట్లాడుతూ, ఆర్ బి చౌద‌రి గారి ఆధ్వ‌‌ర్యంలో సూపర్‌గుడ్‌ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ బేన‌ర్‌లో తెలుగులో  35-40 ఫిలింస్ తీశాం. అన్ని భాష‌ల‌లో కలిపి 94సినిమాలు నిర్మించారు. ఎంతో మంది హీరోల‌ని ,టెక్నీషియ‌న్స్‌ని ప‌రిచ‌యం చేశారు. దాదాపు 30 సంవ‌త్స‌రాల నుండి ఈ బేన‌ర్‌తో అసోసియేట్ అయినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. యూత్‌కి న‌చ్చే సినిమా. త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాను``అన్నారు.
 
ఆర్ బి చౌద‌రి మాట్లాడుతూ, ఈ బేన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న 94వ చిత్రం. మా బేన‌ర్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులుని, టెక్నీషియ‌న్స్‌ని ప‌రిచ‌యం చేశాం. ఇప్పుడు మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తున్నాం. అలాగే తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ కి ఆల్ ది బెస్ట్‌. అలాగే సంగీత ద‌ర్శ‌కుడు  మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్, సినిమాటోగ్రాఫ‌ర్‌ శ్యామ్ కె. నాయుడు, ఎడిట‌ర్ వ‌ర‌ప్ర‌సాద్ స‌హా ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్‌. ఇష్క్ సినిమా ఏప్రిల్ 23న థియేట‌ర్‌ల‌లో రిలీజ‌వుతుంది. 23 త‌ర్వాత ఈ మూవీ స‌క్సెస్ మీట్‌లో మ‌ళ్లీ క‌లుద్దాం`` అన్నారు.
 
నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్ మాట్లాడుతూ, సుస్వాగ‌తం` లాంటి యూత్ కి సంబందించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఖ‌చ్చితంగా మిమ్మ‌ల్నంద‌రినీ అల‌రిస్తుంది.  తేజ జూనియ‌ర్ ఆర్టిస్టుగా మ‌న‌కు ఎప్ప‌టినుంచో ప‌రిచ‌యం, అయితే ఓబేబి, జాంబీరెడ్డి వంటి స్క్రిప్ట్‌ల‌ను ఎంచుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక సీనియ‌ర్ యాక్ట‌ర్‌లాగా మంచి పెర్‌ఫామెన్స్ చేశాడు. ప్ర‌స్తుతం యువ హీరోలు ప్ర‌మోష‌న్స్ అనేవి ఒక బాధ్య‌‌తాయుతంగా భావించి వాటిలో భాగం అవ‌డం చాలా హ్యాపీ.. ప్ర‌స్తుతం సినిమాల‌కు అది అవ‌స‌రం. తేజ న‌న్ను కలిసిన ప్ర‌తిసారి సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో దాని గురించే మాట్లాడాడు. ఒక మంచి సినిమాని మీరంద‌రూ ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను అన్నారు. 
 
‌చిత్ర దర్శకుడు య‌స్‌.య‌స్‌. రాజు మాట్లాడుతూ, ఈ సినిమాను 29 డేస్‌లో క్వాలిటీగా చేయడానికి కారణం శ్యామ్‌కేనాయుడు గారు. తేజ‌, ప్రియా, రవీందర్ ఇలా అందరు బాగా చేశారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ మంచి మ్యూజిక్‌ ఇచ్చారని అన్నారు.
 
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ,``ట్రైల‌ర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. తేజ నాకు దాదాపు ఐదు సంవ‌త్స‌రాల‌నుండి బాగా ప‌రిచ‌యం. సినిమాలంటే చాలా ప్యాష‌న్‌. ఈ సినిమా జాంబీరెడ్డిలాగా మంచి హిట్ అవ్వాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటూ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఇంకా హీరోలు సందీప్ కిష‌న్, శ్రీ విష్ణు, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ,  ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మాట్లాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు