రానా భార్య మిహిక సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనుందా..? (video)

సోమవారం, 16 నవంబరు 2020 (11:25 IST)
దగ్గుబాటి రానా... మిహిక బజాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ వివాహం గురించి వార్తలు వచ్చిన తర్వాత... ముఖ్యంగా పెళ్లైన తర్వాత మిహిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అది ఏంటంటే.. ఉత్తరాది ముద్దుగుమ్మల మాదిరిగా మిహిక బజాజ్ చాలా అందంగా ఉంది.
 
ఆమె హీరోయిన్‌గా పరిచయం అయితే... తప్పకుండా సక్సెస్ అవుతారు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇది చూసి చాలామంది నిజమే కదా.. మిహిక అందంగా ఉంటుంది కదా.. సినిమాల్లో నటిస్తుందేమో అనుకున్నారు. 
 
ఈ ప్రచారం ఇక్కడితో ఆగకుండా... ఆమె హీరోయిన్‌గా నటించేందుకు సిద్దంగానే ఉందని అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి.
 
అయితే... ప్రచారంలో ఉన్న ఈ వార్తల గురించి రానాని అడిగితే... క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ రానా ఏం చెప్పారంటే... మిహికకు సినిమాల పై అసలు ఆసక్తి లేదు. ఆమె పూర్తిగా తన ఈవెంట్లు మరియు ఇతర వ్యాపారాల పైనే ఫోకస్‌తో ఉంది. సినిమాల వైపే ఆమె చూడటం లేదు అంటూ రానా క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరు మొదటి దీపావళిని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకున్నారు.
 
 రానా ప్రచారంలో ఉన్న వార్తలకి క్లారిటీ ఇచ్చేసారు. సో... మిహిక ఇక సినిమాల్లో నటించడం అనేది పుకారే తప్పా.. అందులో ఎలాంటి వాస్తవం లేదు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు