దీపావళి పండుగ కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు

ఆదివారం, 5 నవంబరు 2023 (17:16 IST)
దీపావళి పండుగ సందర్భంగా ఏర్పడే రద్దీని నివారించేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్ళను నడుపనుంది. వీటిలో కొన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రవేశించనున్నాయి. ఇదే విషయంపై రైల్వే శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
రైల్వే శాఖ ప్రకటన ప్రకారం, నవంబర్ 13, 20, 27 తేదీల్లో చెన్నై సెంట్రల్ - భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసు (నెంబర్ 06073) నడుపుతారు. ఈ రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.45కి బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30కి భువనేశ్వర్ చేరుకుంటుంది. 
 
అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి ఈ నెల 14, 21, 28 తేదీల్లో భువనేశ్వర్ నుంచి చెన్నై సెంట్రల్‌కు ప్రత్యేక రైలును (నెంబర్ 06074) నడుపుతారు. ఇది భువనేశ్వర్ స్టేషన్ నుంచి ఈ రైలు రాత్రి 9కి బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3కి చెన్నై చేరుకుంటుంది. చెన్నై - భవనేశ్వర్ రైళ్లు ఏపీలోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు పేర్కొన్నారు.
 
చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నవంబర్ 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చి వరకూ స్పెషల్ సూపర్ ఫాస్ట్ (నెంబర్ 06071) రైలును నడుపనున్నారు. చెన్నై సెంట్రల్లో రాత్రి 11.45కి ఈ రైలు బయల్దేరి, మూడో రోజు తెల్లవారుజామున గం.3.45కి సంత్రాగచ్చికి చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో సంత్రాగచ్చి నుంచి చెన్నై సెంట్రల్‌కు ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలు (నెంబర్ 06072) నడుపుతారు. 
 
సంత్రాగచ్చిలో తెల్లవారు జామున 5కి బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నె సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఏపీలో గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు రైల్వేస్టేషన్లలో ఆగుతాయని రైల్వే శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు