అయోధ్యలో భూమి పూజ.. 1.25లక్షల లడ్డూల పంపిణీ.. ఎక్కడెక్కడంటే?

మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:04 IST)
Laddus
అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజకు ముహూర్తం ఖరారైంది. బుధవారం ఈ పూజ వైభవంగా జరుగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య భూమి పూజను పురస్కరించుకుని.. అయోధ్యతో పాటు బీహార్‌లోని పలు ప్రాంతాల్లో మొత్తం 1.25 లక్షల లడ్డూలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పాట్నాకు చెందిన మహావీర్ మందిర్ ట్రస్టు లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
 
మొత్తం 1.25 లక్షల లడ్డూల్లో 51వేల లడ్డూను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఇస్తారు. ఆలయ భూమి పూజ సందర్భంగా తీర్థ క్షేత్ర టస్టు వారు ఆ లడ్డూలను భక్తులకు పంచుతారు. రఘుపతి లడ్డూల పేరిట ఆ లడ్డూలను పంపిణీ చేయనున్నారు.
 
ఇక రూ.1.25 లక్షల్లో 51వేల లడ్డూలు పోగా మిగిలిన వాటిని బీహార్‌లోని జానకి పుట్టిన చోటు వద్ద, మరో 25 ఆధ్యాత్మిక కేంద్రాల్లో పంచుతారు. అలాగే కొన్ని లడ్డూలను బీహార్‌లో రాముడు, హనుమంతుడి భక్తులకు పంచుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు