పండుగ సీజన్‌ వేళ డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించిన అమెజాన్‌ ఇండియా

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (22:59 IST)
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ సీజన్‌ కోసం తమ డెలివరీ నెట్‌వర్క్‌ను గణనీయంగా వృద్ధి చేసినట్లు అమెజాన్‌ ఇండియా నేడు వెల్లడించింది. ఈ కంపెనీ తమ డెలివరీ మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంతో పాటుగా వేలాది మంది డెలివరీ భాగస్వాములను తమ నెట్‌వర్క్‌కు జోడించడం ద్వారా రాబోతున్న పండుగ సీజన్‌లో వృద్ధి చెందనున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చనుంది.
 
ఈ కంపెనీ దాదాపు 200 డెలివరీ స్టేషన్‌లను జోడించింది. వీటిలో దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీస్‌ భాగస్వాములు నిర్వహించేవి సైతం ఉన్నాయి. తద్వారా తమ ప్రత్యక్ష చేరికను విస్తరించింది. దీనిలో ఈశాన్య రాష్ట్రాలలోని పట్టణాలు అయినటువంటి ఛాంపాయ్‌, కోలసిబ్‌, లుమ్డింగ్‌ మరియు మోకోక్‌చుంగ్‌ వంటివి సైతం ఉన్నాయి.
 
ఈ కంపెనీ తమ డెలివరీ కార్యక్రమాలను బలోపేతం చేసుకోవడంతో పాటుగా తయమ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఐ హ్యావ్‌ స్పేస్‌’ (ఐహెచ్‌ఎస్‌)ను సైతం బలోపేతం చేసింది. దీనిలో350కు పైగా నగరాల నుంచి దాదాపు 28వేలకు పైగా చుట్టుపక్కల ప్రాంతాలలోని కిరాణాలు సైతం ఉన్నాయి. ఈ ‘ఐ హ్యావ్‌ స్పేస్‌’ కార్యక్రమం ద్వారా, అమెజాన్‌ ఇండియా తమ స్ధానిక స్టోర్‌ యజమానులతో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా తమ స్టోర్లకు 2 నుంచి 4 కిలోమీటర్ల రేడియస్‌లోని వినియోగదారులకు ఉత్పత్తులను డెలివరీ చేస్తుంది.
 
తద్వారా తమ సాధారణ ఆదాయానికి అదనపు ఆదాయం జోడించుకోవడంతో పాటుగా తమ స్టోర్లలో సందర్శకుల సంఖ్యను సైతం మరింతగా వృద్ధి చేస్తుంది. అంతేకాదు, గతనాలుగు నెలల్లో అమెజాన్‌ ఫ్లెక్స్‌ కార్యక్రమ  చేరికను దాదాపు రెట్టింపు చేసి, భారతదేశంలో ఇప్పుడు 65 నగరాలకు సేవలను అందిస్తుంది. ఈ కార్యక్రమ వృద్ధికి ప్రధాన కారణంగా డెలివరీ భాగస్వాములకు ఇది అందించే సౌకర్యం నిలుస్తుంది. ఇది తమ సొంత షెడ్యూల్స్‌కు అనుగుణంగా పనిచేసే అవకాశం కల్పించడంతో పాటుగా గంటకు 120-140 రూపాయల అదనపు ఆదాయాన్ని అమెజాన్‌ ప్యాకేజీలను డెలివరీ చేయడం ద్వారా అందిస్తుంది.
 
కాంటాక్ట్‌లెస్‌ డెలివరీలపై అమితంగా దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా అమెజాన్‌ ఇండియా ఇప్పుడు సొసైటీ పికప్‌ పాయింట్లను పరిచయం చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలలో అత్యధిక సాంద్రత కలిగిన రెసిడెన్షియల్‌ సొసైటీల అవసరాలను తీర్చే డెలివరీ ఫార్మాట్‌ ఇది. ఈ కార్యక్రమం వర్ట్యువల్‌ పికప్‌ పాయింట్లతో పాటుగా ఫిజికల్‌ లొకేషన్స్‌ను హౌసింగ్‌ కాంప్లెక్స్‌ల లోపల అందిస్తుంది. వినియోగదారులు చెకవుట్‌ సమయంలో వీటిని ఎంచుకోవచ్చు. డెలివరీలను వినియోగదారుల సౌకర్యార్థం వారంలో ఏరోజు అయినా ఎంచుకోవచ్చు.
 
ఈ డెలివరీ నెట్‌వర్క్‌ విస్తరణ గురించి  ప్రకాష్‌ రొచ్లానీ, డైరెక్టర్‌, లాస్ట్‌మైల్‌ ఆపరేషన్స్‌, అమెజాన్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘మా డెలివరీ కార్యక్రమాలను ఇటీవలనే విస్తరించడమనేది, పండుగ సీజన్‌ వేళ వేగవంతమైన మరియు సురక్షితమైన, క్లిష్టత లేని రీతిలో ఈ–కామర్స్‌ అనుభవాలను అందించడంతో పాటుగా మా చేరికను మరింతగా మెరుగుపరచాలనే అమెజాన్‌ ఇండియా యొక్క లక్ష్యాన్ని సమిష్టిగా ఇది మెరుగుపరుస్తుంది.
 
దేశవ్యాప్తంగా మా వినియోగదారులకు ఈ పండుగ సీజన్‌లో వారు ఏం కోరుకుంటున్నారో దానిని సౌకర్యవంతంగా వారి ఇంటి వద్దనే అందించడం. అదే సమయంలో మా వినియోగదారులతో పాటుగా డెలివరీ భాగస్వాముల భద్రతకు సైతం భరోసా అందించాలన్నది మా ప్రాధాన్యత. మా డెలివరీ నెట్‌వర్క్‌ను సురక్షితంగా మార్చేందుకు తీవ్రంగా శ్రమించడంతో పాటుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ నో కాంటాక్ట్‌ డెలివరీలను అందిస్తున్నాం’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు