వందేభారత్ సెమీ-హై స్పీడ్ రైళ్లకు మూడు డిపోలు

సెల్వి

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (17:16 IST)
వందేభారత్ రైళ్లకు రైలు ప్రయాణికులలో విశేష ఆదరణ లభించిన తర్వాత వాటి కోసం మూడు ఆధునిక నిర్వహణ డిపోలను ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ నిర్ణయించింది. ఈ సెమీ-హై స్పీడ్ రైళ్లకు అగ్రశ్రేణి నిర్వహణను అందించే ప్రయత్నంలో, దక్షిణ మధ్య రైల్వే జోన్ మూడు ఆధునిక నిర్వహణ డిపోలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. 
 
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లాపూర్‌లో ఒక డిపో, చెర్లపల్లిలో రానున్న నాలుగో ప్యాసింజర్ టెర్మినల్‌లో రెండవది, తిరుపతిలో మరొక డిపో ఉంటుంది. ఇటీవలి మధ్యంతర బడ్జెట్‌లో వీబీ రైళ్ల నిర్వహణకు దాదాపు రూ.10 కోట్లు కేటాయించారు. 
 
ప్రస్తుతం, ప్రాథమిక నిర్వహణ సికింద్రాబాద్, కాచిగూడ కోచింగ్ యార్డులలో నిర్వహించబడుతుండగా, విజయవాడ మరియు తిరుపతిలలో ఇతర ముగింపు నిర్వహణను నిర్వహిస్తున్నారు. అదనంగా, హైదరాబాద్ (నాంపల్లి) కోచింగ్ యార్డ్‌లోని మరొక లైన్‌కు కూడా ఓవర్ హెడ్ పరికరాలు (ఓహెచ్‌ఈ) అందించబడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు