బతుకమ్మ పండగ బృహదీశ్వరీ దేవి వియోగానికి కారణమట?

మంగళవారం, 10 అక్టోబరు 2023 (18:46 IST)
బతుకమ్మ పండగ వెనక మన చారిత్రక నేపథ్యం కూడా ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో చాళుక్యులు వేములవాడను రాజధానిగా ఉపయోగించేవారు. అయితే చాళుక్యులను జయించిన చోళులు తమ ఆరాధ్య దైవమైన బృహదీశ్వరుణ్ని తంజావూరుకు తరలించుకుపోయి బృహదీశ్వరీ దేవి వియోగ దుఃఖానికి కారణమయ్యారు. 
 
ఆ బాధను తలుచుకుని జానపదులు అమావాస్య రోజున అమ్మవారిని పూవ్వుల రూపంలో పేర్చి అశ్రు తర్పణం విడిచి తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడడం సంప్రదాయంగా మారిందని కథనం. 
 
అయితే వేములవాడలో ఉన్న రాజన్నను బృహదీశ్వరుడనీ.. రాజరాజేశ్వరి అమ్మవారిని బృహదీశ్వరి అని.. జానపదుల మాటలతో బతుకమ్మగా మారిందని అంటుంటారు. అందుకే తెలంగాణలో బతుకమ్మ పండగును గౌరమ్మగా తలచి జరుపుకుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు