ఎనీమియా... ఇవి తింటే రక్తహీనతను అరికట్టవచ్చు...

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:19 IST)
రక్త హీనతను ఎనీమియా అంటారు. శరీరానికి అవసరమైన రక్తం లేనట్లయితే అది రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తీసుకుంటుంటే రక్తం స్థాయిలు పెరిగుతాయి. స్ట్రాబెర్రీలలో ఐరన్ కంటెంట్ అధికంగా వుంటుంది. వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, ఎ, ఇ - విటమనులు కూడా ఉంటాయి.
 
అలాగే ఖర్జూరాలలో ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికముగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు హీమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతాయి.
 
ఇంకా పండ్లు, కూరగాయల విషయానికి వస్తే... బీట్‌రూట్, ఆరెంజ్, క్యారెట్ రసాలను ప్రతిరోజూ తాగుతూ వుంటే హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి.
 
మాంసాహారులైతే మటన్‌ తింటే హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది. కోడిగుడ్లు కూడా శరీరంలో ఇనుము స్థాయిని పెంచుతాయి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు