గర్భిణీకి సిజేరియన్-కడుపులో డిన్నర్ ప్లేట్.. మరిచిపోయి కుట్లు వేశారు..

మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (18:57 IST)
Dinner plate sized
న్యూజిలాండ్ నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీప దేశం. దీని రాజధాని వెల్లింగ్టన్. ఆక్లాండ్ దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి. ఇక్కడి ఆసుపత్రిలో ఓ గర్భిణి ప్రసవం కోసం చేరింది. సహజ ప్రసవం అయ్యే అవకాశం లేకపోవడంతో ఆమెకు సి-సెక్షన్ అనే సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. 
 
ప్రసవం తర్వాత ఏడాదిన్నర పాటు ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. వైద్యం చేసినా మాత్రలు వేసినా నొప్పి తగ్గకపోవడంతో ఎక్స్‌రే తీశారు. పరీక్షలో కూడా అసాధారణంగా ఏమీ కనిపించలేదు. దీని తర్వాత ఆమెకు సీటీ స్కాన్ చేశారు. 
 
ఈ సీటీ స్కాన్‌లో వైద్యులకు షాక్ తప్పలేదు. ఆమె కడుపులో డిన్నర్ ప్లేట్ పరిమాణంలో ఉన్న వస్తువును కనుగొన్నారు వైద్యులు. దీని తర్వాత, మహిళకు అత్యవసర శస్త్రచికిత్స చేసి వస్తువును తొలగించారు. శస్త్రచికిత్స సమయంలో ఆమె కడుపులో వున్న వస్తువు వైద్యులు ఉపయోగించే అలెక్సిస్ రిట్రాక్టర్ అని తేలింది.
 
వైద్యులు నిర్లక్ష్యంగా మహిళ కడుపులో ఉంచి శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన దానిని కుట్టేశారు. ఆసుపత్రి నుండి ఎటువంటి వివరణ లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు