గుజరాత్‌ విద్యా మంత్రికి హైకోర్టు షాక్‌

బుధవారం, 13 మే 2020 (08:25 IST)
గుజరాత్‌ విద్యా శాఖ మంత్రి, బిజెపి నేత భూపేంద్ర సిన్హ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లందంటూ న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డోల్కా నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన పలు అక్రమ, అడ్డదారుల ద్వారా గెలిచారని నిర్ధారించిన కోర్టు ఆయన ఎన్నిక చట్టవిరుద్ధమని పేర్కొంది. కేవలం 327 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచిన భూపేంద్ర సిన్హ్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి అశ్విన్‌ రాథోడ్‌ హైకోర్టును ఆశ్రయించారు.

కౌటింగ్‌ ప్రక్రియలో ఆయన పలు అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని రాథోడ్‌ కోర్టుకు తెలిపారు. దీనిపై పలుమార్లు విచారణ చేసిన జస్టిస్‌ పర్వేష్‌ ఉపాధ్యారు తీర్పును పలు వారాల పాటు రిజర్వ్‌లో ఉంచి తాజాగా వెలువరించారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించేదందుకు తీర్పుపై స్టే ఇవ్వాలన్న భూపేంద్ర సిన్హ్‌ అభ్యర్ధనను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తాజా తీర్పుపై సర్వోత్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చే వరకూ ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అవకాశం లేదు.

ఇదే సమయంలో భూపేంద్ర సిన్హ్‌ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించిన నేపథ్యంలో తాను విజయం సాధించినట్లుగా ప్రకటించాలన్న పిటిషన్‌దారుడైన అశ్విన్‌ రాథోడ్‌ అభ్యర్ధనను కూడా కోర్టు తిరస్కరించింది. 
 
కౌటింగ్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న ధావల్‌ జాని పలు అక్రమాలకు పాల్పడ్డారని, బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా పోలింగ్‌ అయిన 429 ఓట్లను ఆయన తిరస్కరించారని రాథోడ్‌ కోర్టుకు తెలిపారు.

దీనికితోడు ఇవిఎం మిషన్లలో పోలయిన ఓట్లలో 29 ఓట్లను కూడా లెక్కించలేదని అన్నారు. భూపేంద్రసిన్హ్‌ ఎపిసోడ్‌పై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ స్పందిస్తూ కోర్టు తీర్పును పార్టీ పరిశీలిస్తుందని, న్యాయవ్యూహంపై తరువాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు