కరోనా కాలంలో ఏ ఆహారం తీసుకోవాలి? - ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?

శనివారం, 1 ఆగస్టు 2020 (17:05 IST)
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతిరోజు దాదాపు 50 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
 
శాఖాహారం తినవలసినవి:
 
-- బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు మొదలగు వాటిని తినండి
-- బీన్స్, చిక్కుడు మరియు పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు 
-- ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్ మరియు వంకాయ మొదలగు వాటిని) చేర్చండి
-- రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని త్రాగండి
-- పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని కలుగచేయు సి విటమిన్ ఉంటుంది. తద్వారా అంటు సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది
-- ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక శక్తి యొక్క సహజత్వాన్ని పెంపొందిస్తాయి.
-- ఇంటిలో వండిన ఆహారాన్ని తినండి. క్రొవ్వు పదార్థాలు మరియు నూనెలను తక్కువగా తినండి
-- పండ్లను, కూరగాయలను తినడానికి ముందు శుభ్రంగా కడగండి
-- వెన్న తీసిన పాలు మరియు పెరుగును తీసుకోండి. వీటిలో ప్రోటీన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
 
తినకూడనివి :
-- మైదా, వేపుళ్ళు మరియు జంక్ ఫుడ్(చిప్స్, కుక్కీస్) తినకండి
-- శీతల పానీయాలు, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకండి - వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి 
-- చీజ్, కొబ్బరి మరియు పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి
 
మాంసాహారం తినవలసినవి :
-- మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచకండి
-- స్కిన్ చికెన్, చేపలు మరియు గ్రుడ్డు తెల్లసొన మొదలగు వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకొనుటకు ప్రాధాన్యత ఇవ్వండి.
 
తినకూడనివి :
-- మాంసం, లివర్, వేపిన మాంసాన్ని తినకండి
-- వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోండి
-- పూర్తి గ్రుడ్డుని (పచ్చసొనతో కలిపి) వారంలో ఒక్కసారి మాత్రమే తీసుకోండి
 
గమనిక: కరోనా వైరస్ సోకిన వారిలో 80 శాతం పైగా రోగులు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు లేదా స్వల్ప లక్షణాలైన తక్కువ జ్వరం లేక దగ్గు కనిపించవచ్చు. అటువంటి వారు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు ఇంట్లో ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు