లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్ యువకుడి ఆత్మహత్య

సెల్వి

మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (16:05 IST)
హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైపోయాడు. తీసుకున్న రుణానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. దీంతో మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం పట్టణానికి చెందిన శీలం మనోజ్ దుండిగల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల లోన్ యాప్ ద్వారా కొంత మొత్తం లోన్ తీసుకున్నాడు. ఈ లోన్ ఈఎంఐ సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో యాప్ ఏజెంట్లు బెదిరింపులకు గురిచేశారు. 
 
కుటుంబ సభ్యులకు, బంధువులు, స్నేహితులకు లోన్ యాప్ ఏజెంట్లు ఫోన్ చేశారు. ఈ విషయం తెలియడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన మనోజ్ సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
మనోజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మనోజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు